తనను రెండు కళ్లు గమనిస్తున్నాయని గుర్తించింది అపూర్వ.
ఆవైపుగా తనూ దృష్టి సారించింది.
అవే కళ్లు.. తనకిష్టమైన కళ్లు.. 15 ఏళ్ల తర్వాత…
ఆశ్చర్యంతో ఒక్క క్షణం చూసింది. వెంటనే కనుమరుగయ్యాయి.
ఇంకా చూడాలనిపించింది. కానీ అర్జున్ బండిమీద తాను.
అర్జున్ అపూర్వను అక్కడకు దగ్గరలోనే ఉన్న గ్రంథాలయం ముందు దించి, అరగంటలో వస్తానంటూ వెళ్లిపోయాడు.