Saturday, February 4, 2012

జ్ఞానసంపద


'బాలోత్సవ్‌-2010' 'కథారచన'లో సీనియర్‌లలో నాల్గవ బహుమతి పొందిన కథ;
రచన: జి.వినయ్, (ఇంగ్లీషులో) వి.వి.విద్యాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.

నేను చాలా అల్లరి పిల్లవాణ్ణి. నాకు ఐదేళ్లు. మా కుటుంబసభ్యులతో కలిసి ఒకసారి తిరుపతి వెళ్లాను. మేమంతా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుందామని కొండపైకి నడుచుకుంటూ వెళుతున్నాము. అలా ఎక్కుతూ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి నాకు బాగా నచ్చింది. ఆ మొక్కలు, పూలు ఎంతో బాగున్నాయి. సరిగ్గా మార్గం మధ్యలోకి వచ్చాము.
అక్కడో లోయ ఉంది. ఆ లోయ లోపల ఏముందో చూడాలన్న ఆసక్తి కలిగింది. అమ్మానాన్నకు చెప్పకుండా

అపూర్వ


తనను రెండు కళ్లు గమనిస్తున్నాయని గుర్తించింది అపూర్వ.
ఆవైపుగా తనూ దృష్టి సారించింది.
అవే కళ్లు.. తనకిష్టమైన కళ్లు.. 15 ఏళ్ల తర్వాత…
ఆశ్చర్యంతో ఒక్క క్షణం చూసింది. వెంటనే కనుమరుగయ్యాయి.
ఇంకా చూడాలనిపించింది. కానీ అర్జున్‌ బండిమీద తాను.
అర్జున్‌ అపూర్వను అక్కడకు దగ్గరలోనే ఉన్న గ్రంథాలయం ముందు దించి, అరగంటలో వస్తానంటూ వెళ్లిపోయాడు.

‘మంచి ముత్యం’ ఒక ‘ఆణిముత్యం’


దేవరాజు మహారాజుగారి అనువాదాల్లోంచి జాలువారిని ‘మంచి ముత్యం’ ఒక ‘ఆణిముత్యం’. ఆయన చేసిన అనువాదం ఆద్యంతం పాఠకులను ఆకట్టుకుంటుంది. నవల మూల రచయిత ఈయనేనా అన్నట్లుంది. ఎక్కడా ఎటువంటి తొట్రుపాటూ లేదు. లేశమంతైనా అతిశయోక్తి లేదు. మొదట్లో రచయిత గురించి చెపుతూ దేవరాజుగారు

కొత్త ‘మలుపే’



బడబాగ్ని శంకరరాజు ఉత్తమ ఉపాధ్యాయుడే కాదు.. సామాజిక దృష్టి, శాస్త్రీయ దృక్పథం కలిగినవాడు. ఈ ఉత్తమ లక్షణాలన్నీ ఆయన రాసిన ప్రతి కథలోనూ వెల్లివిరిశాయి. ఆయా ప్రాంతాల మాండలికాలను ఉపయోగించడమే కాకుండా సమాజంలో అన్యాయానికి గురయ్యే వారందరినీ ఒక్కొక్క కథలో ప్రస్తావించారు. ఆయన పుట్టింది నెల్లూరులో, ఉద్యోగం చేసేది విజయనగరంలో.. కానీ ఆయన కథలు సీమకు కళింగకు ముడిపెడుతూ ‘అదుపులేని పొదుపు’ కథ రాయడం ఆయన హృదయ విస్తృతికి అద్దం పడుతుంది. అయితే ఈ కథలో మరో ముఖ్య విషయాన్ని ‘మతం మత్తు మందులాంటిదని’ మార్క్సును తల్చుకున్న తీరు ప్రశంసనీయం. తాగుబోతువాడు, మతం మత్తులో ఉన్నోడూ ఒక్కటే అన్న పోలిక హేతుబద్దంగా ఉంది. పెత్తందారులకూ, దళితులకూ మధ్య అంతరాన్ని ఆయన ‘మృత్యుజలం’ కథలో ఎంతో హృద్యంగా వర్ణించారు. ఆస్తులు పంచుకున్న తర్వాత అన్నదమ్ములు కట్టుకున్న ఇళ్లలా పెత్తందార్ల, దళితుల పల్లెలు ఎడంఎడంగా ఉండడాన్ని వర్ణించడం సందర్భోచితంగా ఉంది. పెత్తందారి కొడుకు మోటుబావిలో పడిపోతే పండితుడు దేవుణ్ణి రక్షించమని వేడుకోవటం, దళితుడైన లోకేశు రక్షించేందుకు దూకబోతుంటే ‘అంటరానివాడివి’ అనటం మూఢత్వాన్ని తెలియజేసింది. మనుషుల

స్ఫూర్తిగా నిలవాలని..


ఆ బాలికకు పుట్టుకతోనే రెండుచేతులూ లేవు. అలా పుట్టిందని వాళ్లమ్మ మతిస్థిమితం కోల్పోయింది. రెండేళ్లప్పుడు కన్నతండ్రే రోడ్డుమీద వదిలి వెళ్లిపోయాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన శిక్షతో అన్నిపనులూ తనే చేసుకొంటోంది. ‘మౌనంగానే ఎదగమని మొక్కనీకు చెపుతోంది’ అన్న పాట ఈ పాప ప్రావీణ్యానికి అతికినట్లుంది. రాయడం దగ్గర

సౌకర్యం … సౌలభ్యం!


నాడు నార చీరలు ధరించేవారంటే ఏమిటో అనుకున్నాం.. ఇప్పుడదే పెద్ద ఫ్యాషనై కూర్చుంది. అంతే కాదు జూట్‌ పర్యావరణాన్ని పదికాలాల పాటు కాపాడుతోంది. నేడు జూట్‌ (నార) బ్యాగుల దగ్గర నుంచి చీరలు, నగల వరకూ వ్యాప్తి చెందింది. ఇందు కలను అందులేను సందేహం వలదన్నట్లు అన్నింటా తానేనంటోంది.. అంటోంది ఏంటి మీరే చూడండి.. మహిళలు ధరించే బ్యాగులు, పిల్లలు స్కూలుబ్యాగులు, షాపింగ్‌ బ్యాగులు, పిల్లల బొమ్మలు, టేబుల్‌

పుస్తకం


చరిత్రను నింపుకుంటుంది
జీవితాల్ని చదివిస్తుంది
దు:ఖాన్ని కలిగిస్తుంది
విచారాన్ని వెల్లడిస్తుంది
కోపాన్ని వెళ్లగక్కుతుంది
ప్రేమను పంచుతుంది
ఉద్యమాలకు దిక్సూచవుతుంది
సమానత్వం పాటిస్తుంది
పేద-గొప్ప స్త్రీ-పురుష చిన్నా-పెద్ద
మంచీ-చెడ్డా ప్రేమ-కోపం
తారతమ్యాలు లేవంటుంది
అన్నింటికీ చోటిస్తుంది
ఎద లోతుల్ని తడుముతుంది
అమ్మలా హత్తుకుంటుంది
నాన్నలా దిశను నిర్దేశిస్తుంది
సహచరుడిలా తోడుంటుంది
నేస్తమై వెన్నంటి ఉంటుంది
రెక్కలున్నట్లే ఎగిరిపోతుంది
ప్రపంచాన్ని చూపిస్తుంది
నిజాల్ని వెల్లడిస్తుంది
అసత్యాల్నీ మూటగడుతుంది
కాగితాలను కలిపేసుకుంటుంది
కవిత్వాల్ని కౌగిలించుకుంటుంది
కథల్ని కళ్లకుగడుతుంది
గ్రంథాలను గౌరవిస్తుంది
రచయితలకు వెలుగునిస్తుంది
కొత్తదనాన్ని రుచి చూపిస్తుంది
పాతదనాన్ని సమీక్షిస్తుంటుంది
విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది
విచక్షణను మేలుకొల్పుతుంది
విద్వేషాలనూ రగిలిస్తుంది
విప్లవాలను జ్వలింపజేస్తుంది
సాహిత్య సేద్యంలో కీలకమవుతుంది
భాండాగారాల్లో నిక్షిప్తమౌతుంది
పరిజ్ఞానానికి ఆధారమవుతుంది
పరిహాసాలకూ చోటిస్తుంది
దరహాసాలనూ చిందిస్తుంది
నిరసనలకూ వేదికవుతుంది
గర్వంతో మిడిసిపడుతుంది
మస్తిష్కాల్లో దూరిపోతుంది
మనస్సులను ప్రభావితం చేస్తుంది
చైతన్యాన్ని పెంపొందిస్తుంది
నిరుత్సాహాన్ని కలిగిస్తుంది
ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది
ఆవేశాలను రగిలిస్తుంది
ఉత్సాహానికి పురికొల్పుతుంది
భావోద్వేగాలకి ఆలవాలమవుతుంది
బాధ్యతల్ని గుర్తు చేస్తుంది
తన ప్రస్థానం అనంతమంటుంది
తననెవరూ ఆపలేరంటుంది
తనకెవరూ ఎదురులేరంటుంది

- శాంతిశ్రీ