Saturday, February 4, 2012

నీవు.. నేను.. సమం


ఆకాశంలో.. సగం నీవు సగం నేను
అనంతకోటి నక్షత్రాల్లో..సగం నీవు సగం నేను
సంగీతంలో
రాగం నీవు తానం నేను

పాటలో
పల్లవి నీవు చరణం నేను
కానీ…
చట్టసభల్లో
అవకాశాల్లో నీవు అవరోధాల్లో నేను
సంపద సృష్టిలో
ఫలం నీవు పనిలో నేను
సమాజంలో
బానిసవు నీవు బానిసకు బానిసను నేను
స్థానిక సంస్థల్లో
పదవుల్లో నీవు త్యాగాల్లో నేను
ఉద్యమంలో
నాయకత్వంలో నీవు కార్యకర్తల్లో నేను
నీవు..నేను..సమం
అయితే..
ఉద్యమిస్తే ఉధృత పోరాటం
విప్లవిస్తే సమసమాజం
అప్పుడు..
ఆకాశంలో
నీవు.. నేను.. సమం
సమాజంలో
నీవు..నేను.. సమం
చట్టసభల్లో
నీవు.. నేను.. సమం
స్థానికసంస్థల్లో
నీవు.. నేను.. సమం
సంపద సృష్టిలో
నీవు.. నేను.. సమం
సంతోషంలో
నీవు.. నేను.. సమం

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)


- శాంతిశ్రీ

No comments:

Post a Comment