Sunday, November 21, 2010

ఆఖరి ఆకు

- శాంతిశ్రీ 
'' 'ది లాస్ట్‌ లీఫ్‌' అనే పేరుతో ఓ. హెన్రీ అనే ప్రసిద్ధ అమెరికన్‌ రచయిత కలం నుండి ఈ కథ జాలువారింది. ఇది మా చిన్నప్పుడు చదువుకున్న కథ. ఈ ఏడాది మీకోసం చెపుతున్నా. మీరందరూ ఇది మీ మీ ఇళ్లకు వెళ్లాక, మీ తల్లి దండ్రులకు, స్నేహితులకు చెప్పండి..'' అంటూ డా|| రమేష్‌ మామయ్య కథ చెప్పటం ప్రారంభించారు.. కథలోకి వెళితే..

బాలోత్సాహం వెల్లివిరిసిన బాలోత్సవ్‌

  - శాంతిశ్రీ

అనగనగా కథలు..
బుడి బుడి నడకలు..
బుజ్జి బుజ్జి రాగాలు..
చిట్టి చిట్టి కవితలు..
చిన్ని చిన్ని చిత్రాలు..
కేరింతలు.. తుళ్లింతలు..
ఆనంద డోలికలు.. ఆహ్లాద వీచికలు..
మధురం.. సుమధురం..
'బాలోత్సవ్‌-2010' పిల్లల పండుగ..

Friday, November 19, 2010

చలికాలంలో జాగ్రత్తలు

రోజూ ఉదయాన్నే లేవగానే గడియారం చూస్తే చిన్న ముల్లు పెద్దముల్లుతో పోటీపడి పరిగెడుతున్నట్లు అనిపిస్తోంది కదూ! మరోపక్కేమో మంచంమీద నుంచి లేవబుద్ధి కావడంలేదు కూడా! మరి వాతావరణం చల్లగా చల్లగా ఉంటే అలాగే ఎంతసేపైనా పడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటారూ? ఎందుకేంటండీ... చలికాలం ఆరంభమైంది కదా మరి! ఈ చలికాలం మన టైమును తినేయడమే కాదు మన శరీరంమీదా అనేక ప్రభావాలు చూపిస్తుంది. ప్రధానంగా చర్మం మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. ఈ కాలంలో చేతులు, పాదాలు, పెదాలు, జుట్టుకు ఎదురయ్యే సమస్యలకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరి... మరి ఆ చిన్నపాటి జాగ్రత్తలు ఏమిటో మీరే చదవండి...

చిగురుటాకు

 (కథ)

- శాంతిశ్రీ

అనగా అనగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుకు పెద్ద కాండం ఉంది. ఆ కాండానికి అనేక పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలకు చిన్ని చిన్ని రెమ్మలు ఉన్నాయి. ఆ రెమ్మలుకు కొన్ని పండుటాకులు, కొన్ని ముదురు ఆకుపచ్చరంగు ఆకులు, కొన్ని లేత ఆకుపచ్చరంగు ఆకులు, కొన్ని చిగురుటాకులు ఉన్నాయి. చల్లటి గాలి వీస్తోంది. ఆ చల్లటి గాలికి ఆకులన్నిటికీ జోకొట్టినట్లుంది. కొద్దిసేపటికి సూర్యకిరణాలు వెచ్చగా తగిలేటప్పటికి అవి ఉలిక్కిపడి లేచాయి. ఓ చిగురుటాకు ఆనందంతో కేరింతలు కొట్టింది. ఇంతలో దానికి ఓ చక్కని పాట లీలగా వినిపించింది. ఆలకిస్తున్న కొద్దీ చిగురుటాకుకు ఆ పాట చాలా సుమధురంగా అనిపించింది. ఆ పాట చుట్టూ ఉన్న చెట్లమీద నుంచి వినిపిస్తోందని చిగురుటాకు గమనించింది. ఈ పాటను మర్రి చెట్టుమీద పండుటాకులు కూడా విన్నాయి. అవి కూడా వాటితో గళం కలిపాయి.

దుబాయిలో జీవన చిత్రం

- శాంతిశ్రీ
మనిషి నిరంతర అన్వేషి. కొత్త విషయాలను తెలుసుకోవడం మన ప్రవృత్తిలోనే దాగుంది. మరో ప్రాంతపు సంస్కృతీ సాంప్రదాయాలను తెలుసుకోవడం, అందులోని మంచిని గ్రహించడం ఎంతో ఆసక్తి కలిగించే అంశం. అదే మనిషి ఎదుగుదలకు, వ్యక్తిత్వ నిర్మాణానికీ మూలకేంద్రం. ఆ కుతూహలమే నాకు తెలియని మరో ప్రపంచాన్ని నా ఎదుట నిలిపింది. నా విజయవాడ ప్రయాణం అనుకోని వ్యక్తుల పరిచయానికి దారితీసింది. ఆ పరిచయం మరో దేశపు అలవాట్లు, ఆచారాలు తెలుసుకునే వేదికగా మారింది. రిజర్వేషన్‌ లేకపోవడంతో జనరల్‌బోగీలో ఎక్కిన నాకు ఎదురుగా వున్న మహిళ వేషభాషలు, తీరుతెన్నులు ఆమె ఆర్థిక ఉన్నతిని తెలియజేస్తున్నాయి. ఆమె ఇలా జనరల్‌బోగీలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితేంటో అనుకున్నా... అడగడం సభ్యతకాదని ఊరుకున్నా.

పుస్తకం

- శాంతిశ్రీ
చరిత్రను నింపుకుంటుంది
జీవితాల్ని చదివిస్తుంది
దు:ఖాన్ని కలిగిస్తుంది
విచారాన్ని వెల్లడిస్తుంది
కోపాన్ని వెళ్లగక్కుతుంది
ప్రేమను పంచుతుంది
ఉద్యమాలకు దిక్సూచవుతుంది
సమానత్వం పాటిస్తుంది
పేద-గొప్ప స్త్రీ-పురుష చిన్నా-పెద్ద
మంచీ-చెడ్డా ప్రేమ-కోపం
తారతమ్యాలు లేవంటుంది
అన్నింటికీ చోటిస్తుంది
ఎద లోతుల్ని తడుముతుంది
అమ్మలా హత్తుకుంటుంది
నాన్నలా దిశను నిర్దేశిస్తుంది
సహచరుడిలా తోడుంటుంది
నేస్తమై వెన్నంటి ఉంటుంది
రెక్కలున్నట్లే ఎగిరిపోతుంది
ప్రపంచాన్ని చూపిస్తుంది
నిజాల్ని వెల్లడిస్తుంది
అసత్యాల్నీ మూటగడుతుంది
కాగితాలను కలిపేసుకుంటుంది
కవిత్వాల్ని కౌగిలించుకుంటుంది
కథల్ని కళ్లకుగడుతుంది
గ్రంథాలను గౌరవిస్తుంది
రచయితలకు వెలుగునిస్తుంది
కొత్తదనాన్ని రుచి చూపిస్తుంది
పాతదనాన్ని సమీక్షిస్తుంటుంది
విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది
విచక్షణను మేలుకొల్పుతుంది
విద్వేషాలనూ రగిలిస్తుంది
విప్లవాలను జ్వలింపజేస్తుంది
సాహిత్య సేద్యంలో కీలకమవుతుంది
భాండాగారాల్లో నిక్షిప్తమౌతుంది
పరిజ్ఞానానికి ఆధారమవుతుంది
పరిహాసాలకూ చోటిస్తుంది
దరహాసాలనూ చిందిస్తుంది
నిరసనలకూ వేదికవుతుంది
గర్వంతో మిడిసిపడుతుంది
మస్తిష్కాల్లో దూరిపోతుంది
మనస్సులను ప్రభావితం చేస్తుంది
చైతన్యాన్ని పెంపొందిస్తుంది
నిరుత్సాహాన్ని కలిగిస్తుంది
ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది
ఆవేశాలను రగిలిస్తుంది
ఉత్సాహానికి పురికొల్పుతుంది
భావోద్వేగాలకి ఆలవాలమవుతుంది
బాధ్యతల్ని గుర్తు చేస్తుంది
తన ప్రస్థానం అనంతమంటుంది
తననెవరూ ఆపలేరంటుంది
తనకెవరూ ఎదురులేరంటుంది

స్నేహం...

- శాంతిశ్రీ
విజయాన్ని గుండెలకు హత్తుకునేది
ఓటమి ముంగిట ఓదార్చేది
కన్నీటి భాషను చదవగలిగేది
స్నేహమొక్కటే.. అదే లేకపోతే
జీవితానికి అర్థమేమిటి?

ఆనందాన్ని పంచేది
బాధలను దూరం చేసేది
బతుకులోని బాంధవ్యాన్ని
ఎప్పుడడిగినా ఇచ్చేది
ఆత్మీయత ఒక్కటే.. అదే లేకపోతే
మనుగడలో మాధుర్యమేమిటి?

కుగ్రామంగా మారిన ప్రపంచంలో
అమ్మలా నడిపించేది
నాన్నలా బాధ్యతగలది
మైత్రి ఒక్కటే.. అదే లేకపోతే
లోకంలో మిగిలేదేమిటి?
స్వార్థం దరిజేరనిది
మోసానికి చోటులేనిది
నేస్తమొక్కటే.. అదే లేకపోతే
సహజీవన సూత్రమేమిటి?

శూన్యం తరుముతున్నా
కన్నీటి కట్టలు తెగిపోయినా
ఆనందపు అలలలో కొట్టుకుపోయినా
స్నేహ కవచం.. నీచుట్టూ ఉంటే
విజయం నీవెంట.. విజేతవు నీవేనంట..

(స్నేహితులకు అంకితం...)

Wednesday, November 17, 2010

అక్టోబర్‌ విప్లవం .. స్ఫూర్తిదాయకం ..

- శాంతిశ్రీ   Sat, 6 Nov 2010,  

అదే అక్టోబర్‌ విప్లవం. ఇదే జారు చక్రవర్తికి, అతని రాజ్యానికి వ్యతిరేకంగా లెనిన్‌ నాయకత్వంలో జరిగిన 'బోల్షివిక్‌ విప్లవం'. పాత క్యాలెండర్‌ ప్రకారం ఆ విప్లవం అక్టోబర్‌ 17వ తేదీన జరిగింది. అందుకే అది 'అక్టోబర్‌ విప్లవం'గా పిలువబడింది. కొత్త క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ 7వ తేదీ అవుతుంది. అందుకే నవంబర్‌ 7వ తేదీనే 'అక్టోబర్‌ విప్లవ దినోత్సవం'.సరే.. రష్యాలో అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. అది 1905వ సంవత్సరం. ఆ ఏడు రష్యాలో పెద్ద తిరుగుబాటు వచ్చింది. ప్రవాసంలో ఉన్న లెనిన్‌ తిరిగి వచ్చాడు. ఆయనే ఆ

Tuesday, November 16, 2010

శ్రామికులే అంతిమ విజేతలు

వెయ్యేళ్ల మానవ సమాజ పరిణామక్రమంలో శ్రామికులే అంతిమ విజేతలు. ప్రముఖ రచయిత లియో హ్యూబర్‌మన్‌ తాను రచించిన మూలగ్రంథం ‘Man’s Worldly Goods’లో ఈ విషయాన్నే సుస్పష్టం చేశారు. ఈయన వివిధ దేశాలకు చెందిన ప్రాచీనకాలపు రికార్డులను అధ్యయనం చేసి, రచించిన పరిశోధనాత్మక గ్రంథం ఇది. దీన్ని 'మానవుడు-సంపద-సమాజం' అన్న పేరుతో తెలుగులో అందరికీ అర్థమయ్యేలా అనువదించేందుకు కొమ్మారెడ్డి

మానవీయుడే

మావో అంగరక్షకుడు లీ చెప్పిన విషయాల్ని అతను చెపుతున్నట్లుగానే రచయిత క్వాన్‌యాంచి చేసిన ప్రయోగం Man, Not God’ పుస్తకానికి జీవం పోసినట్లైంది. దీన్ని తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో, దృశ్యాలు చెదరకుండా మనకందించిన అనువాదకులు కె.సత్యరంజన్‌ అభినందనీయులు. మావో గురించిన సత్యాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారందరికీ ఈ పుస్తకం సంతృప్తిని కలిగిస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన మహనీయుల

తప్పటడుగులు ... పడిలేచే పాఠాలు ...

మన చిన్ననాటి సంగతులు అన్నీ గుర్తుండవు. కానీ మన ఇంట్లో మన తమ్ముడో.. చెల్లో.. బంధువుల ఇంట్లోనో ఎవరో ఒకరి చిన్నతనాన్ని చూసైనా.. చూస్తూనో ఉంటాం కదూ! చిన్నారులు అడుగులు నేర్చుకునేటప్పుడు వేసే తప్పటడుగులు చూసే ఉంటారు. ప్రతి ఒక్కరికీ బాల్యం మనో వికాస గురువు. ఆ బోసి నవ్వుల వెనుక ఎంతో కార్యదీక్ష