Saturday, January 1, 2011

జ్ఞానసంపద

'బాలోత్సవ్‌-2010' 'కథారచన'లో సీనియర్‌లలో నాల్గవ బహుమతి పొందిన కథ;  
రచన: జి.వినయ్, (ఇంగ్లీషులో) వి.వి.విద్యాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.


    నేను చాలా అల్లరి పిల్లవాణ్ణి. నాకు ఐదేళ్లు. మా కుటుంబసభ్యులతో కలిసి ఒకసారి తిరుపతి వెళ్లాను. మేమంతా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుందామని కొండపైకి నడుచుకుంటూ వెళుతున్నాము. అలా ఎక్కుతూ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి నాకు బాగా నచ్చింది. ఆ మొక్కలు, పూలు ఎంతో బాగున్నాయి. సరిగ్గా మార్గం మధ్యలోకి వచ్చాము.

    Tuesday, December 21, 2010

    సమానత్వం.. (కథ)

    సునీతకు చిన్నప్పటి నుంచి క్రిస్మస్‌ చెట్టు పెట్టాలని కోరిక..
    దానికి చాక్లేట్లు వేలాడదీయాలని, గ్రీటింగ్స్‌ కట్టాలని.. శాంతాక్లాజ్‌ తాత నుంచి బహుమతి పొందాలని అభిలాష.
    కానీ వాళ్ల నాన్నకి కోపం కాస్త జాస్తి. ఒక రకంగా సాంప్రదాయాలికి విలువ ఇచ్చే మనిషి. ఆయన్ని క్ర్ర్రిస్మస్‌ చెట్టు పెట్టాలని అడగడానికి సునీతకు ధైర్యం చాలలేదు. చివరకు క్రిస్మస్‌ చెట్టు మాట, శాంతాక్లాజ్‌ తాత బహుమతి మాట మరుగున పడిపోయాయి.

    Sunday, November 21, 2010

    ఆఖరి ఆకు

    - శాంతిశ్రీ 
    '' 'ది లాస్ట్‌ లీఫ్‌' అనే పేరుతో ఓ. హెన్రీ అనే ప్రసిద్ధ అమెరికన్‌ రచయిత కలం నుండి ఈ కథ జాలువారింది. ఇది మా చిన్నప్పుడు చదువుకున్న కథ. ఈ ఏడాది మీకోసం చెపుతున్నా. మీరందరూ ఇది మీ మీ ఇళ్లకు వెళ్లాక, మీ తల్లి దండ్రులకు, స్నేహితులకు చెప్పండి..'' అంటూ డా|| రమేష్‌ మామయ్య కథ చెప్పటం ప్రారంభించారు.. కథలోకి వెళితే..

    బాలోత్సాహం వెల్లివిరిసిన బాలోత్సవ్‌

      - శాంతిశ్రీ

    అనగనగా కథలు..
    బుడి బుడి నడకలు..
    బుజ్జి బుజ్జి రాగాలు..
    చిట్టి చిట్టి కవితలు..
    చిన్ని చిన్ని చిత్రాలు..
    కేరింతలు.. తుళ్లింతలు..
    ఆనంద డోలికలు.. ఆహ్లాద వీచికలు..
    మధురం.. సుమధురం..
    'బాలోత్సవ్‌-2010' పిల్లల పండుగ..

    Friday, November 19, 2010

    చలికాలంలో జాగ్రత్తలు

    రోజూ ఉదయాన్నే లేవగానే గడియారం చూస్తే చిన్న ముల్లు పెద్దముల్లుతో పోటీపడి పరిగెడుతున్నట్లు అనిపిస్తోంది కదూ! మరోపక్కేమో మంచంమీద నుంచి లేవబుద్ధి కావడంలేదు కూడా! మరి వాతావరణం చల్లగా చల్లగా ఉంటే అలాగే ఎంతసేపైనా పడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటారూ? ఎందుకేంటండీ... చలికాలం ఆరంభమైంది కదా మరి! ఈ చలికాలం మన టైమును తినేయడమే కాదు మన శరీరంమీదా అనేక ప్రభావాలు చూపిస్తుంది. ప్రధానంగా చర్మం మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. ఈ కాలంలో చేతులు, పాదాలు, పెదాలు, జుట్టుకు ఎదురయ్యే సమస్యలకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరి... మరి ఆ చిన్నపాటి జాగ్రత్తలు ఏమిటో మీరే చదవండి...

    చిగురుటాకు

     (కథ)

    - శాంతిశ్రీ

    అనగా అనగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుకు పెద్ద కాండం ఉంది. ఆ కాండానికి అనేక పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలకు చిన్ని చిన్ని రెమ్మలు ఉన్నాయి. ఆ రెమ్మలుకు కొన్ని పండుటాకులు, కొన్ని ముదురు ఆకుపచ్చరంగు ఆకులు, కొన్ని లేత ఆకుపచ్చరంగు ఆకులు, కొన్ని చిగురుటాకులు ఉన్నాయి. చల్లటి గాలి వీస్తోంది. ఆ చల్లటి గాలికి ఆకులన్నిటికీ జోకొట్టినట్లుంది. కొద్దిసేపటికి సూర్యకిరణాలు వెచ్చగా తగిలేటప్పటికి అవి ఉలిక్కిపడి లేచాయి. ఓ చిగురుటాకు ఆనందంతో కేరింతలు కొట్టింది. ఇంతలో దానికి ఓ చక్కని పాట లీలగా వినిపించింది. ఆలకిస్తున్న కొద్దీ చిగురుటాకుకు ఆ పాట చాలా సుమధురంగా అనిపించింది. ఆ పాట చుట్టూ ఉన్న చెట్లమీద నుంచి వినిపిస్తోందని చిగురుటాకు గమనించింది. ఈ పాటను మర్రి చెట్టుమీద పండుటాకులు కూడా విన్నాయి. అవి కూడా వాటితో గళం కలిపాయి.

    దుబాయిలో జీవన చిత్రం

    - శాంతిశ్రీ
    మనిషి నిరంతర అన్వేషి. కొత్త విషయాలను తెలుసుకోవడం మన ప్రవృత్తిలోనే దాగుంది. మరో ప్రాంతపు సంస్కృతీ సాంప్రదాయాలను తెలుసుకోవడం, అందులోని మంచిని గ్రహించడం ఎంతో ఆసక్తి కలిగించే అంశం. అదే మనిషి ఎదుగుదలకు, వ్యక్తిత్వ నిర్మాణానికీ మూలకేంద్రం. ఆ కుతూహలమే నాకు తెలియని మరో ప్రపంచాన్ని నా ఎదుట నిలిపింది. నా విజయవాడ ప్రయాణం అనుకోని వ్యక్తుల పరిచయానికి దారితీసింది. ఆ పరిచయం మరో దేశపు అలవాట్లు, ఆచారాలు తెలుసుకునే వేదికగా మారింది. రిజర్వేషన్‌ లేకపోవడంతో జనరల్‌బోగీలో ఎక్కిన నాకు ఎదురుగా వున్న మహిళ వేషభాషలు, తీరుతెన్నులు ఆమె ఆర్థిక ఉన్నతిని తెలియజేస్తున్నాయి. ఆమె ఇలా జనరల్‌బోగీలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితేంటో అనుకున్నా... అడగడం సభ్యతకాదని ఊరుకున్నా.