- శాంతిశ్రీ
'' 'ది లాస్ట్ లీఫ్' అనే పేరుతో ఓ. హెన్రీ అనే ప్రసిద్ధ అమెరికన్ రచయిత కలం నుండి ఈ కథ జాలువారింది. ఇది మా చిన్నప్పుడు చదువుకున్న కథ. ఈ ఏడాది మీకోసం చెపుతున్నా. మీరందరూ ఇది మీ మీ ఇళ్లకు వెళ్లాక, మీ తల్లి దండ్రులకు, స్నేహితులకు చెప్పండి..'' అంటూ డా|| రమేష్ మామయ్య కథ చెప్పటం ప్రారంభించారు.. కథలోకి వెళితే..Sunday, November 21, 2010
బాలోత్సాహం వెల్లివిరిసిన బాలోత్సవ్
- శాంతిశ్రీ
బుడి బుడి నడకలు..
బుజ్జి బుజ్జి రాగాలు..
చిట్టి చిట్టి కవితలు..
చిన్ని చిన్ని చిత్రాలు..
కేరింతలు.. తుళ్లింతలు..
ఆనంద డోలికలు.. ఆహ్లాద వీచికలు..
మధురం.. సుమధురం..
'బాలోత్సవ్-2010' పిల్లల పండుగ..
Friday, November 19, 2010
చలికాలంలో జాగ్రత్తలు
చిగురుటాకు
(కథ)
- శాంతిశ్రీ
దుబాయిలో జీవన చిత్రం
- శాంతిశ్రీ
పుస్తకం
- శాంతిశ్రీ
చరిత్రను నింపుకుంటుందిజీవితాల్ని చదివిస్తుంది
దు:ఖాన్ని కలిగిస్తుంది
విచారాన్ని వెల్లడిస్తుంది
కోపాన్ని వెళ్లగక్కుతుంది
ప్రేమను పంచుతుంది
ఉద్యమాలకు దిక్సూచవుతుంది
సమానత్వం పాటిస్తుంది
పేద-గొప్ప స్త్రీ-పురుష చిన్నా-పెద్ద
మంచీ-చెడ్డా ప్రేమ-కోపం
తారతమ్యాలు లేవంటుంది
అన్నింటికీ చోటిస్తుంది
ఎద లోతుల్ని తడుముతుంది
అమ్మలా హత్తుకుంటుంది
నాన్నలా దిశను నిర్దేశిస్తుంది
సహచరుడిలా తోడుంటుంది
నేస్తమై వెన్నంటి ఉంటుంది
రెక్కలున్నట్లే ఎగిరిపోతుంది
ప్రపంచాన్ని చూపిస్తుంది
నిజాల్ని వెల్లడిస్తుంది
అసత్యాల్నీ మూటగడుతుంది
కాగితాలను కలిపేసుకుంటుంది
కవిత్వాల్ని కౌగిలించుకుంటుంది
కథల్ని కళ్లకుగడుతుంది
గ్రంథాలను గౌరవిస్తుంది
రచయితలకు వెలుగునిస్తుంది
కొత్తదనాన్ని రుచి చూపిస్తుంది
పాతదనాన్ని సమీక్షిస్తుంటుంది
విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది
విచక్షణను మేలుకొల్పుతుంది
విద్వేషాలనూ రగిలిస్తుంది
విప్లవాలను జ్వలింపజేస్తుంది
సాహిత్య సేద్యంలో కీలకమవుతుంది
భాండాగారాల్లో నిక్షిప్తమౌతుంది
పరిజ్ఞానానికి ఆధారమవుతుంది
పరిహాసాలకూ చోటిస్తుంది
దరహాసాలనూ చిందిస్తుంది
నిరసనలకూ వేదికవుతుంది
గర్వంతో మిడిసిపడుతుంది
మస్తిష్కాల్లో దూరిపోతుంది
మనస్సులను ప్రభావితం చేస్తుంది
చైతన్యాన్ని పెంపొందిస్తుంది
నిరుత్సాహాన్ని కలిగిస్తుంది
ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది
ఆవేశాలను రగిలిస్తుంది
ఉత్సాహానికి పురికొల్పుతుంది
భావోద్వేగాలకి ఆలవాలమవుతుంది
బాధ్యతల్ని గుర్తు చేస్తుంది
తన ప్రస్థానం అనంతమంటుంది
తననెవరూ ఆపలేరంటుంది
తనకెవరూ ఎదురులేరంటుంది
స్నేహం...
ఓటమి ముంగిట ఓదార్చేది
కన్నీటి భాషను చదవగలిగేది
స్నేహమొక్కటే.. అదే లేకపోతే
జీవితానికి అర్థమేమిటి?
ఆనందాన్ని పంచేది
బాధలను దూరం చేసేది
బతుకులోని బాంధవ్యాన్ని
ఎప్పుడడిగినా ఇచ్చేది
ఆత్మీయత ఒక్కటే.. అదే లేకపోతే
మనుగడలో మాధుర్యమేమిటి?
కుగ్రామంగా మారిన ప్రపంచంలో
అమ్మలా నడిపించేది
నాన్నలా బాధ్యతగలది
మైత్రి ఒక్కటే.. అదే లేకపోతే
లోకంలో మిగిలేదేమిటి?
స్వార్థం దరిజేరనిది
మోసానికి చోటులేనిది
నేస్తమొక్కటే.. అదే లేకపోతే
సహజీవన సూత్రమేమిటి?
శూన్యం తరుముతున్నా
కన్నీటి కట్టలు తెగిపోయినా
ఆనందపు అలలలో కొట్టుకుపోయినా
స్నేహ కవచం.. నీచుట్టూ ఉంటే
విజయం నీవెంట.. విజేతవు నీవేనంట..
(స్నేహితులకు అంకితం...)
Wednesday, November 17, 2010
అక్టోబర్ విప్లవం .. స్ఫూర్తిదాయకం ..
- శాంతిశ్రీ Sat, 6 Nov 2010,
Tuesday, November 16, 2010
శ్రామికులే అంతిమ విజేతలు
మానవీయుడే
మావో అంగరక్షకుడు లీ చెప్పిన విషయాల్ని అతను చెపుతున్నట్లుగానే రచయిత క్వాన్‌యాంచి చేసిన ప్రయోగం Man, Not God’ పుస్తకానికి జీవం పోసినట్లైంది. దీన్ని తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో, దృశ్యాలు చెదరకుండా మనకందించిన అనువాదకులు కె.సత్యరంజన్ అభినందనీయులు. మావో గురించిన సత్యాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారందరికీ ఈ పుస్తకం సంతృప్తిని కలిగిస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన మహనీయుల
తప్పటడుగులు ... పడిలేచే పాఠాలు ...
Subscribe to:
Posts (Atom)